యువకుడి వేధింపులు.. అమ్మాయి ఆత్మాహుతి

3 Oct, 2014 14:38 IST|Sakshi

స్థానిక యువకుడు ఒకడు పదే పదే వెంటపడుతూ వేధించడంతో తట్టుకోలేని ఓ అమ్మాయి ఆత్మాహుతి చేసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానె భయందర్ టౌన్షిప్ ప్రాంతంలో జరిగింది. 16 ఏళ్ల ఆ అమ్మాయిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పదే పదే వెంటపడి వేధించేవాడు.

తనను ప్రేమించాలంటూ పదే పదే అడిగేవాడు. అతడు అంతలా వేధించడం, తనను చంపుతానని కూడా బెదిరించడంతో అమ్మాయి తట్టుకోలేకపోయింది. చివరకు ఏమీ చేయలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 306, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడిని మాత్రం ఇంతవరకు అరెస్టు చేయలేదు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు