భారత్ బలహీనతలన్నీ ఇప్పటికే పరిగణలోకి..

21 Aug, 2013 02:34 IST|Sakshi
భారత్ బలహీనతలన్నీ ఇప్పటికే పరిగణలోకి..
న్యూఢిల్లీ: భారత్ బలహీన ఆర్థిక పరిస్థితులన్నీ ప్రస్తుత రేటింగ్స్‌కు అనుగుణంగానే ఉన్నాయని రేటింగ్ దిగ్గజ సంస్థలు స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ), మూడీస్ మంగళవారం పేర్కొన్నాయి. పలు అంశాలు ఇప్పటికే ‘డిస్కౌంటయిన’ నేపథ్యంలో ప్రస్తుత ఔట్‌లుక్‌లలో ఎటువంటి మార్పులూ చేయబోవడం లేదని సైతం స్పష్టం చేశాయి. 
 
 బీబీబీ కొనసాగింపు: ఎస్ అండ్ పీ
 భారత్ రేటింగ్స్‌పై నెగిటివ్ ఔట్‌లుక్- ‘బీబీబీ-’ సావరిన్ క్రెటిగ్ రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ సీనియర్ డెరైక్టర్ (సావరిన్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ రేటింగ్స్-ఆసియా,పసిఫిక్) కిమ్ ఇంగ్ టెన్ ఒక ఈ-మెయిల్ ప్రకటనలో పేర్కొన్నారు. క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్, రూపాయి తీవ్ర బలహీనత పెట్టుబడుదారు విశ్వాసంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.  క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్‌ను నిరోధిస్తూ, ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు అటు దేశీయంగా ఇటు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను అయోమయంలో పడేస్తాయని కిమ్  పేర్కొన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పెట్టుబడులు మరింత క్షీణిస్తాయని విశ్లేషించారు.  
 
 బీఏఏ3 రేటింగ్: మూడీస్
 తమ రేటింగ్ ఔట్‌లుక్ ‘బీఏఏ3’పై రూపాయి బలహీనత ప్రభావం ఏదీ ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది.  రూపాయి బలహీనత, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, బలహీన వృద్ధి... ప్రస్తుతం తామ సావరిన్ రేటింగ్‌కు ఇప్పటికే ఫ్యాక్టరింగ్ అయిన అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్-ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అత్‌సీ సేథ్ ఒక పత్రంలో  పేర్కొన్నారు. నిర్ణయాలపై భవిష్యత్ స్పందనల ప్రకారం తమ తదుపరి రేటింగ్ పరిశీలన ఆధారపడి ఉంటుందని అన్నారు.   
 
మరిన్ని వార్తలు