దేశంలో ప్రభుత్వ వైద్యం 30 శాతమే!!

15 May, 2014 13:19 IST|Sakshi

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తన పదేళ్ల పాలనాకాలంలో ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా అటకెక్కించింది. భారతదేశంలో 70 శాతం వైద్యం అంతా ప్రైవేటు రంగం చేతుల్లోనే ఉంది. కేవలం 30 శాతం వైద్యసేవలు మాత్రమే ప్రభుత్వరంగంలో అందుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్యురాలు ఎంవీ పద్మా శ్రీవాత్సవ తెలిపారు. నిరుపేదలకు వైద్యం అందని మావిగా మారిందని, వైద్యఖర్చులు చాలా ఎక్కువ అయిపోయాయని ఆమె అన్నారు.

ఈ విషయంలో మన విధానాలు సంపూర్ణంగా మారాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఆరోగ్యం అనేది విలాసం కాదని, ప్రతి ఒక్కరికీ అవసరమని, అందువల్ల అది ప్రభుత్వ బాధ్యత అని ఆమె తెలిపారు. భారతదేశం కంటే తక్కువగా ఆరోగ్యరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉన్న దేశాలు ప్రపంచంలో కేవలం 11 మాత్రమేనని ఎయిమ్స్ సీనియర్ పాథాలజిస్టు మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. అలాగే, ప్రైవేటు రంగంలో వైద్యంపై ఎక్కువగా ఖర్చుపెడుతున్న దేశాలు భారత్ కంటే 12 మాత్రమే ఎక్కువని కూడా ఆయన తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం వైద్యసేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు