బిల్ గేట్స్ తో విడిపోవడానికి కారణం అదే

4 Nov, 2016 20:34 IST|Sakshi
బిల్ గేట్స్ తో విడిపోవడానికి కారణం అదే

హార్డ్ వేర్ రంగంలోకి ప్రవేశించాలని తాను సూచించిన ఆలోచన కారణంగానే మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకుడు బిల్ గేట్స్ తో సహచర్యాన్ని వదులుకోవాల్సివచ్చిందని మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ వెల్లడించారు. బ్లూమ్ బర్గ్ టెలివిజన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన మనసు విప్పి మాట్లాడారు. 

తన ఆలోచనే అమల్లోకి వచ్చి ఉంటే ఇప్పటికి కొన్ని ఏళ్ల క్రితమే మొబైల్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ ప్రవేశించి ఉండేదని అన్నారు. మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలనే ఆలోచనను బోర్డు సభ్యులకు చెప్పినప్పుడు గేట్స్ తో పాటు ఇతరులెవ్వరూ అందుకు అంగీకరించలేదని తెలిపారు. ఆ తర్వాత సొంతంగా మొబైల్స్, ట్యాబ్లెట్ల తయారీపై తలెత్తిన మనస్పర్దల కారణంగానే మైక్రోసాఫ్ట్ నుంచి తాను తప్పుకున్నట్లు చెప్పారు.

2012లో ట్యాబ్లెట్ల మార్కెట్లోకి ప్రవేశించిన మైక్రోసాఫ్ట్ ఘోరంగా విఫలం చెందిందని అన్నారు. దాదాపు 900 మిలియన్ల డాలర్లను హార్డ్ వేర్ మార్కెట్ పై మైక్రోసాఫ్ట్ వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్బీఏ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ కంపెనీని రన్ చేస్తున్న ఆయన హార్డ్ వేర్ మార్కెట్లో నాలుగు బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు