ఇదిగో భారత్.. అదిగో పాక్..

4 Aug, 2016 11:03 IST|Sakshi
ఇదిగో భారత్.. అదిగో పాక్..

సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం పాకిస్థాన్ కు వెళ్లనున్నారు. ఆయన రాకను అక్కడి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్ నాథ్ ను పాక్ లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించాయి కూడా. ఇటీవల కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలకు మద్దతుగా పాకిస్థాన్ లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ఉగ్రవాద సంస్థల నాయకులు ఏకంగా సరిహద్దుల్లోనే బైఠాయింపునకు దిగారు. భారత్ తో సరిహద్దును పంచుకుంటున్న అన్ని దేశాల కంటే పాకిస్థాన్ తోనే మనకు అనేక సమస్యలు! ఇరుదేశాల మధ్య ఇప్పటికే మూడు పెద్ద, ఒక చిన్న యుద్ధాలు జరిగాయన్న సంగతి తెలిసిందే.

ఈశాన్యంలో బంగ్లాదేశ్.. ఉత్తరాన చైనా.. దక్షిణాన హిందూ మహాసముద్ర ద్వీపదేశం శ్రీలంక.. ఇలా భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నీ ఏదోఒక సందర్భంలో మనతో కయ్యానికి దిగినవే. వాయువ్యంలోని పాకిస్థాన్ సంగతి సరాసరే! నిత్యం ఉద్రిక్తవాతావరణాలతో ఇండో-పాక్ సరిహద్దు 'ప్రపంచంలోని కల్లోల సరిహద్దుల్లో' ఒకటిగా నిలిచింది. సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే దాయాది దేశంతో మనది చారిత్రక బంధం! 1947లో దేశ విభజన, భారత్- పాక్ ల మధ్య 2,900 కిలోమీటర్ల సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు ఏర్పడింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ)గా పిలిచే ఈ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చాలా చోట్ల ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. కొన్ని చోట్ల సాయుధులు పహారా కాస్తుంటారు. ఎల్ వోసీ వద్ద ఇరుదేశాలు కలిపి దాదాపు 50వేల స్తంభాలు, 1.5 లక్షల ఫ్లడ్ టైట్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట ఆ ఫ్లడ్ లైట్ల కాంతి అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య నాసా ఉపగ్రహం తీసిన భారత్- పాక్ సరిహద్దు ఫొటోల్లో ఆ వెలుగు స్పష్టంగా కనిపించింది. సరిహద్దుల్లోని విభిన్న ప్రాంతాల అరుదైన ఫొటోలు కొన్ని మీకోసం..

1. నీలం నదికి అటూఇటూ చీలిపోయిన కేరన్ గ్రామం.


2. ఇరుదేశాలను వేరు చేసే చకోటి నది.



3. పిక్నిక్ కు వెళ్లినట్లుగా ప్రజలు నిల్చున్న ఈ చోటు చలియానా లోయలోని అంతర్జాతీయ సరిహద్దు. నీలం ప్రవాహనికి అటుఇటుగా చీలిపోయిన చలియానా గ్రమస్తులు ఒడ్డున నలబడి అరుపులతో సంభాషించుకుంటారు.


4. లల్హూన్- గోవిందీ రోడ్డుకు ఇటు ఇండియా, అటు పాక్.


5. ప్రఖ్యాత వాఘా సరిహద్దు. వాఘా గ్రామం నుంచి అటు 15 కిలోమీటర్లదూరంలో లాహోర్, ఇటు 32 కిలోమీటర్ల దూరంలో అమృత్ సర్ పట్టణాలున్నాయి.


6. సుచేత్ ఘర్ (కశ్మీర్)లోని జీరో లైన్


7. పంజాబ్ లోని కౌసర్ జిల్లా గుండాసింగ్ వాలా సరిహద్దు.


8. చకోటి నదిపై నిర్మించిన అంతర్జాతీయ వారధి.


9. పాక్ పంజాబ్ లోని సియాల్ కోట్ అంతర్జాతీయ సరిహద్దు.


10. నాసా ఉపగ్రహం పై నుంచి తీసిన భారత్-పాక్ సరిహద్దు ఫొటో.

మరిన్ని వార్తలు