రాహుల్గాంధీకి స్వామి సంచలన సలహా

26 Aug, 2016 11:51 IST|Sakshi
రాహుల్గాంధీకి స్వామి సంచలన సలహా

వడోదర: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.   కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి  తనదైన  శైలిలో ఓ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకోసం రాహుల్ రాజకీయాలనుంచి వైదొలగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ద్వేషపూరిత మరియు విభజించే అజెండాపై తన పోరాటం కొనసాగుతుందని రాహుల్  ట్విట్ చేసిన మరుసటి రోజే స్వామి ఇలా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఆ ట్విట్ కూడా రాహుల్ చేసిన ఉండరని  కార్యాలయంలో  మరెవరో చేసి వుంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు.

జాతీయ ప్రాముఖ్యత కీలక అంశాలపై `యు-టర్న్' తీసుకోవడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని స్వామి ఘాటుగా విమర్శించారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని..  అతిపురాతన కాంగ్రెస్  పార్టీ ప్రతిష్టను  కాపాడాలంటే  రాహుల్ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిందేనన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమన్న  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సుప్రీం కోర్టులో పరువునష్టం దావా వేసింది.  మరో రాష్ట్రంలో కూడా  ఆర్ఎస్ఎస్ కేసు పెట్టింది. అయితే  ఈ కేసు విచారణ సందర్భంగా ..  రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను అవమానించలేదని కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో చెప్పారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ట్విట్ చేయడంపై బీజీపీ  వర్గాలు విరుచుకుపడిన సంగతి  తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు