సునందా 'పోస్ట్ మార్టమ్' వ్యాఖ్యలపై కట్టుబడే ఉన్నా

3 Jul, 2014 18:37 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికకు సంబంధించి తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నట్లు అఖిల వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టం చేశారు. బుధవారం  కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు నివేదించినట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజునే ఎయిమ్స్ ఆయన ఆరోపణలను ఖండించడంతో సుధీర్ గుప్తా  పెదవి విప్పారు.  'నేను ముందు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా.అసలు నా మీద ఒత్తిడి తీసుకురాలేదని వారు ఎలా తెలుపుతారు? ఆ విషయం ఎయిమ్స్ బృందానికి ఎలా తెలుస్తుంది. ఒకవేళ ఎటువంటి తప్పు జరగపోతే వారు ఎందుకు ఆగమేఘాల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు?' అంటూ సుధీర్ గుప్తా ప్రశ్నించారు.

 

సుధీర్ గుప్తా సంచలన ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు అమిత్ గుప్తా, నీరజా భాట్లా బుధవారం నిర్ద్వంద్వంగా ఖండించిన సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం సుధీర్ గుప్తాపై బయటనుంచి ఒత్తిడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు