గూగుల్‌ సీఈవో ఎంకరేజింగ్‌ రిప్లై

16 Feb, 2017 17:12 IST|Sakshi

లండన్: గూగుల్ లో ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక  రాసిన లేఖపై  గూగుల్‌  సీఈవో సుందర్ పిచాయికి  స్పందించారు.  మంచి ప్రోత్సాహకర సమాధానం ఇచ్చారు.  ఈ లేఖ రాసినందుకు  బాలికకకు ధన్యవాదాలు తెలిపిన ఆయన తన కలలను ఆమె చేరుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోవాలని ఆ బాలికకు సుందర్ పిచాయి జవాబిచ్చారు.

యూకె కు చెందిన బాలిక  క్లో  తనకు  పెద్దయ్యాక గూగుల్‌ సంస్థలోఉద్యోగం చేయాలని కలలు కంటున్నానని  గూగుల్‌ బాస్‌కి లేఖ రాసింది.  క్లోకు ఇటీవలే ఆదర్శవంతమైన గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తి కలిగిందట. కూతురి కోరిక మేరకు తండ్రి ఆమెను గూగుల్ లో ఉద్యోగం కోసం ధరఖాస్తు పంపాలని కోరారు. ఈ మేరకు ఆమె గూగుల్  బాస్‌కు లేఖ రాసింది. అంతేకాదు కంప్యూటర్లు, రోబోలు, టాబ్లెట్స్ అంటే ఈ బాలికకు చాలా ఇష్టమనీ రాసింది.  గూగుల్ లో పనిచేయడమంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేయడం, ఒలంపిక్స్ లో స్విమ్ చేయాలనే ఆసక్తిని పిచాయ్ కు రాసిన లేఖలో ఆమె తెలిపింది. దీంతో చదువు అయిపోయాక  ఉద్యోగానికి  దరఖాస్తు చేయాంటూ సమాధానం ఇచ్చి  క్లో కలలకు  ఊపిరి పోశారు పిచాయ్‌.  నీ పాఠశాల విద్య పూర్తి చేశాక..మీ ఉద్యోగ అప్లికేషన్ స్వీకరించడంకోసం ఎదురు చూస్తుంటానని రాశారు.  టెక్నాలజీని మరింత నేర్చుకోవాలని ఆశిస్తున్నట్టుగా పిచాయ్ అభిప్రాయపడ్డారు.  అలాగే ఒక స్మైల్ ఎమోజీతో తన లేఖను  ముగించారు పిచాయ్‌.

సాధారణంగా  బొమ్మలు, ఇతర  బహుమతులు కోరుకునే వయసులో ఏకంగా గూగుల్‌ ఉద్యోగం అడిగడం అందర్నీ ఆశ్చర్య పరిస్తే..  గూగుల్‌  సీఈవో సుందర్‌  పిచాయ్‌  అంతే  బాధ్యతాయుతంగా, స్వీట్‌గా రిప్లై ఇవ్వడం  విశేషంగా నిలిచింది.   దీంతో గూగుల్‌ సీఈవో సంతకంతోఉన్న లేఖను చూసిన క్లో   సంతోషంతో పొంగిపోతోందని తండ్రి  ఆండీ బ్రిడ్జ్ వాటర్ చెప్పారు.   అంతేకాదు రెండేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదంతో  డీలా పడిన ఆమెలో నూతనోత్సాహాన్ని,  విశ్వాసాన్ని  పెంపొందించారన్నారు.  దీనికి ఆయన సుందర్‌ పిచాయ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని బిజినెస్‌ ఇన్‌ సైడర్‌ రిపోర్ట్‌ చేసింది.


 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా