సూపర్‌మ్యాన్‌లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను ఆపి!

18 Apr, 2017 13:17 IST|Sakshi
సూపర్‌మ్యాన్‌లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను ఆపి!

బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన క్యాచులు పట్టడం ఇప్పుడు ఒకింత మామూలు విషయమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు బౌండరీ లైన్‌ దగ్గర గాలిలో ఎగిరి క్యాచ్‌లు ఎలా పట్టాలో తీవ్రంగా శిక్షణ తీసుకుంటోంది. కానీ, ఇటీవల ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు సంజూ సామ్సన్‌ అద్భుతమైన ఫీట్‌ చేశాడు. బౌండరీ లైన్‌ వద్ద సూపర్‌ మ్యాన్‌లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను క్యాచ్‌ పట్టుకోవడమే కాదు.. తాను బౌండరీలైన్‌ అవతల పడుతున్నట్టు గుర్తించి వెంటనే బంతిని విసిరేశాడు. దీంతో సంజు సిక్సర్‌ను ఆపినట్టు అయింది.

19 ఓవర్‌ రెండో బంతికి నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టాడు. అది దాదాపు సిక్సర్‌ అని అందరూ అనుకున్నారు. కానీ సంజూ అనూహ్యంగా కుడివైపు జంప్‌ చేస్తూ.. గాలిలోకి ఎగిరి బంతిని అదుకొని.. రెప్పపాటులోనే దానిని మైదానంలోకి విసిరేశాడు. దీంతో సంజు బౌండరీలైన్‌ అవతల పడినా.. సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇది అద్భుతమైన ఫీట్‌ అని క్రికెట్‌ అభిమానులు పొగుడుతున్నారు.
ఈ అద్భుతమైన ఫీట్‌ను మీరూ ఇక్కడ చూడొచ్చు.
 

>
మరిన్ని వార్తలు