సెల్ టవర్ల రేడియేషన్‌పై సుప్రీం సీరియస్

3 Oct, 2016 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ : మొబైల్ టవర్ల  రేడియేషన్ ప్రభావంపై సుప్రీంకోర్టు  సీరియస్ గా స్పందించింది. దీనిపై ఒక నివేదిక సమర్పించాల్సింది కేంద్ర  ప్రభుత్వాన్ని కోరింది. చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు సి. నాగప్పన్,   ఎం ఖాన్ విల్కార్  నేతృత్వంలోని  ధర్మాసనం ఈ వివరణలు కోరింది. నివాస ప్రాంతాల్లో మరియు పాఠశాలల సమీపంలో  నిబంధనలకు  విరుద్ధంగా  సెల్ టవర్ల నిర్మాణంపై నోయిడా  నివాసి  నరేస్ చంద్ర  గుప్త దాఖలు చేసిన పిటిషన్ పై  ఇవాళ సుప్రీం  విచారించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది.  
సెల్ ట‌వ‌ర్ల ద్వారా వెలుబ‌డే రేడియేష‌న్ అంశంపై  సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మొబైల్ టవర్లనుంచి వెలువడే రేడియేషన్ విషతుల్య ప్రభావాలు,  ఉద్గారాల  ప్రమాణాల అమలుకు తీసుకుంటున్న చర్యలను సహా పలు అంశాలపై కేంద్రం నుండి ఒక నివేదిక కోరింది. మొబైల్ టవర్ల ప్రతికూల ప్రభావాలు ఏమిటి? వీటిని మానిటర్ చేయడానికి ఏదైనా  ఏజెన్సీ ఉందా ? చట్టపరమైన నిబంధనలు,  ఈ ప్రమాణాలను  సుప్రీం ప్రశ్నించింది. సెల్ ట‌వ‌ర్ల ఏర్పాటులో టెలిక‌మ్యూనికేష‌న్ శాఖ ఏవైనా ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తించిందా, ఒక‌వేళ అలాంటి సంఘ‌ట‌నలు జ‌రిగితే, దానిపై తీసుకున్న చర్యలపై  సుప్రీం ఆరా తీసింది. నివాస ప్రాంతాల్లో సెల్ ట‌వ‌ర్ల ఏర్పాటుపై ఉన్న కండీష‌న్స్ చెప్పాల‌ని కోర్టు కోరింది.
అలాగే ఇప్పటి వరకు దేశంలో ఉన్న సెల్ టవర్ల సంఖ్య, వాటిపై దాట్ తనిఖీలు తదితర అంశాలపై సమగ్ర  నివేదిక సమర్పించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికంను కోరింది.   దేశంలోని సెల్ టవర్స్ రేడియేషన్ నియంత్రణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాయా? అని ధర్నాసనం ప్రశ్నించింది. నిబంధనలు,  నిబంధనలు  ఉల్లంఘన రిపోర్టులు, అలాంటి వారిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి డాట్ నుండి సమాచారాన్ని కోరింది.  దీంతోపాటు  ఫోన్ సర్వీసు ప్రొవైడర్స్ లకు   టవర్ల నిర్మాణంలో పాటించాల్సిన రేడియేషన్  ప్రమాణాలు, నిబంధనల అమలుపై ఒక టైమ్   ఫ్రేమ్ విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి కొంత సమయం కావాలని  డాట్ న్యాయవాది పత్వాలియా  సుప్రీంకోర్టుకు  విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు