సహారా చీఫ్ కి సుప్రీం షాక్

23 Sep, 2016 11:24 IST|Sakshi
సహారా చీఫ్ కి సుప్రీం షాక్

న్యూఢిల్లీ సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టు షాకి ఇచ్చింది.  ఆయన పెరోల్ ను రద్దు చేసింది. ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన సుబ్రతా   తాత్కాలిక బెయిల్  ను పొడిగించడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.  వెంటనే ఆయన్ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.  అక్టోబర్ మూడు వరకు జ్యడీషియల్  కస్టడీ విధించింది.  ఈ కేసు విచారణ సందర్భంగా సహారా న్యాయవాది, సుప్రీం న్యాయవాది మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.  దీనిపై   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి  సుబ్రతాను జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు.   సహారా చీఫ్ సుబ్రతా రాయ్ తో పాటు మరో ఇద్దరి  పెరోల్  కూడా రద్దు చేసిన  సుప్రీం వారిని తిరిగి జైలుకి పంపాలని  స్పష్టం చేసింది. 

కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి  వెళ్లారు. అయితే  తల్లి మరణంతో మానవీయ కోణంలో  ఈ ఏడాది మే 6 న  నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది.  అనంతరం  ఆయన చెల్లించాల్సినమొత్తంలో  రూ.10,000 కోట్లలో,  సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్  చేయాలనే  షరతు తో ఆగస్టు 3 న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత   నేటివరకు  పొడిగించిన సంగతి తెలిసిందే.

 

>
మరిన్ని వార్తలు