'ఆమె మాటలు అద్భుతం'

2 Oct, 2015 10:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ భారతీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు అద్భుతంగా ఉందని, పాకిస్థాన్కు తగిన సమాధానం చెప్పారని, భారత్ నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు.  చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని భారత్ తరుపున ఐక్యారాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌కు సుష్మా స్వరాజ్ తేల్చి చెప్పారు.

ఇరు దేశాల మధ్య శాంతి చర్యల కోసం ఆ దేశ ప్రధాని చెప్పిన నాలుగు సూ త్రాలు అవసరం లేదని.. ఉగ్రవాదాన్ని నిలిపివేసి చర్చలకు రావటమన్న ఒకే ఒక్క సూత్రం చాలునని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న, సాయపడుతున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో మోదీ ఆమెపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయంగా పలు ముఖ్యమైన అంశాలపై ఆమె మాట్లాడారని చెప్పారు. ఉగ్రవాదానికి సంబంధించిన ప్రతిపనికి స్వస్థి పలికి వెంటనే ప్రపంచశాంతిని నెలకొల్పాలని ఆమె సరిగ్గా చెప్పారని తెలిపారు. బాలికలను స్వయం సమృద్ధిగలవారిగా తీర్చిదిద్దడం ద్వారా సమాజంలో సత్వర మార్పుతీసుకురావచ్చని ఆమె చెప్పిన మాటలతో తాను అంగీకరిస్తానని చెప్పారు. ఐక్యరాజ్య సమితికి భారత్ అందించిన తోడ్పాటుగురించి ఆమె చాలా చక్కగా చెప్పారని, భారత్ విజన్ను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారని వివరించారు.
 

మరిన్ని వార్తలు