స్వీడన్ లో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

8 Apr, 2017 02:06 IST|Sakshi
స్వీడన్ లో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

స్టాక్‌హోంలో స్టోర్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు
స్టాక్‌హోం: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీడన్  రాజధాని స్టాక్‌హోం శుక్రవారం సాయంత్రం ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. స్థానిక మీడియా కథనం మేరకు సెంట్రల్‌ స్టాక్‌హోంలోని ఒక డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లోకి బీరు ట్రక్కు దూసుకుపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. స్టాక్‌హోంలోని భారత్‌ రాయబార కార్యాలయం సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ట్రక్కు దూసుకుపోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, అలాగే ట్రక్కులోంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి ప్రజలపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

మరోవైపు ప్రమాద స్థలం వద్ద కాల్పుల శబ్దాలు వినిపించాయని అయితే అవి ఎవరు జరిపారో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని స్వీడిష్‌ చానల్‌ ఎస్‌వీటీ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రదాడికి పాల్పడినట్లు అనుమమానిస్తున్న వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఉగ్రవాదుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారని, మరొకరు పారిపోయినట్లు కూడా మీడియా కథనాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు