డీఎన్ఏపై పరిశోధనలకు నోబెల్ పురస్కారం

7 Oct, 2015 16:25 IST|Sakshi
డీఎన్ఏపై పరిశోధనలకు నోబెల్ పురస్కారం

స్టాక్ హోం: కణాలు తమ డీఎన్ఏలో తలెత్తే అంతర్గత సమస్యలను ఏవిధంగా పరిష్కరించుకుంటాయి.. ఆ ప్రక్రియలో ఎలాంటి రసాయనిక చర్యలు చోటుచేసుకుంటాయి.. తదితర అంశాలపై 'మెకానిస్టిక్ స్టడీస్ ఆఫ్ డీఎన్ఏ' పేరుతో జరిపిన పరిశోధనలకుగానూ రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.

 

స్విడన్, అమెరికా, టర్కీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు కెమిస్ట్రీ నోబెల్- 2015 పురస్కారానికి ఎంపికయినట్లు బుధవారం నోబెల్ కమిటీ ప్రకటించింది. వీరి ప్రయోగాలతో ఒక తరం నుంచి ఇంకో తరానికి మానవాళి ఏవిధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదో తెలుసుకునే వీలుంటుందని రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. సజీవ కణం ఎలా పనిచేస్తుంది, అది క్యాన్సర్ ట్రీట్ మెంట్ కు ఏవిధంగా ఉపకరిస్తుందనే విశయాలనూ వీరు నిరూపించారు.


స్విడన్ కు చెందిన థామస్ లిండాల్ లండన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, ప్రిన్స్ టన్, రాక్ ఫెల్లర్ యూనివర్సిటీల్లో అనేక పరిశోధనలు చేశారు. యూఎస్ కు చెందిన పాల్ మాడ్రిచ్..డ్యూక్ యూనివర్సిటీ బయోకెమెస్ట్రీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంబుల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పట్టా పుచ్చుకున్న టర్కీ శాస్త్రవేత్త అజీజ్ సన్కార్ డీఎన్ఏ రిపేర్, సెల్ సైకిల్ చెక్ పాయింట్ మొదలగు ప్రయాగాల్లో విశేష ఖ్యాతి గడించారు.
 

మరిన్ని వార్తలు