‘నల్లధనం’వివరాల వెల్లడికి నిరాకరించిన స్విస్ ప్రభుత్వం

27 Mar, 2014 20:24 IST|Sakshi
చిదంబరం

 చెన్నై: భారతీయులు స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్లధనం వివరాలు, ఖాతాదారుల జాబితాను ఇచ్చేందుకు స్విస్ ప్రభుత్వం నిరాకరించింది.  కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.  స్విస్ బ్యాంకుల నుంచి భారతీయులు దాచిపెట్టిన నల్లధనాన్ని రాబట్టాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు.

 ఈ అంశంపై 2009లో స్విస్ ప్రభుత్వానికి తాము లేఖ రాయగా ససేమిరా అంటూ బదులిచ్చారని ఆయన తెలిపారు. అయినా తాము వదలకుండా త్వరలో రాబోయే ఐరోపా దేశాల సమావేశంలో స్విస్‌పై ఒత్తిడి తెస్తామని చిదంబరం స్పష్టం చేశారు.

స్విస్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఫిబ్రవరి 20న ఒక లేఖ రాసింది. నల్లధనం విషయంలో 562 కేసులకు సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చిన అభ్యర్థనలను మూసివేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. స్విట్జర్లాండ్ చట్టాల ప్రకారం అలాంటి అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ దేశ చట్టంలో మార్పులు తీసుకువస్తారన్న ఆశాభావం చిదంబరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు