ఠాగూర్ నోబెల్ మెడల్ చోరీ కేసులో కొత్త మలుపు

12 Dec, 2016 15:16 IST|Sakshi
ఠాగూర్ నోబెల్ మెడల్ చోరీ కేసులో కొత్త మలుపు
కోల్ కతా: ప్రఖ్యాత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కు 1913లో వచ్చిన నోబెల్ బహుమతిని విశ్వభారతి మ్యూజియం నుంచి  దొంగిలించిన గ్రూపుకు సాయం చేసిన వ్యక్తిని సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. బెంగాల్ జానపద గీతాలు(బాల్) సింగర్ ప్రదీప్ బౌరీ నిందితులకు సహకరించాడని పేర్కొన్నారు. బౌరీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాడానికి గుజరాత్ కు తరలించనున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బౌరీ బిర్బూమ్ జిల్లాలోని అతని స్వగ్రామం రుప్పుర్ లో అరెస్టు చేసి విచారణకు తరలించినట్లు చెప్పారు.
 
గత రెండు వారాలుగా బౌరీని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు.. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ మెడల్ దొంగతనంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 1998 నుంచి 2003 వరకూ రుప్పూర్ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన బౌరీ.. నోబెల్ మెడల్ ను దొంగతనం చేసేందుకు నిందితులకు సాయం చేయడమే కాకుండా రాష్ట్రం నుంచి పారిపోయేందుకు కూడా సహకరించినట్లు తెలిసింది. ఓ బంగ్లాదేశీ జాతీయుడు, ఇద్దరు యూరోపియన్ జాతీయులు ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు బౌరీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. 2004లో మ్యూజియం నుంచి దొంగతనానికి గురైన మెడల్ ను తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పడంతో కేసులో విచారణ వేగవంతమైంది. 
మరిన్ని వార్తలు