అతనో దిగ్గజ కంపెనీ మేనేజర్.. చేసింది దొంగపని!

12 Dec, 2016 15:03 IST|Sakshi
అతనో దిగ్గజ కంపెనీ మేనేజర్.. చేసింది దొంగపని!
తైపీ : అతనో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్ కాన్కి మాజీ సీనియర్ మేనేజర్. కానీ సుమారు రూ.10 కోట్ల విలువైన ఐఫోన్లను చోరి చేశాడు. ఈ విషయాన్ని తైవనీస్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం వెల్లడించారు. అయితే అతను దొంగలించిన ఐఫోన్లెనో తెలుసా? దాదాపు 5700 ఫోన్లను దొంగతనం చేసి, వాటిని చైనా మార్కెట్లో విక్రయించాడు. ఫాక్స్ కాన్ ఆపిల్, సోనీ లాంటి అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పత్తులన్నింటిన్నీ ఒకచోట చేర్చి, కాంట్రాక్ట్పై వీటిని తయారుచేస్తోంది. చైనాలో మిలియన్ల కొద్దీ వర్కర్లు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు.
 
టిసాయ్ కుటుంబ పేరుకు చెందిన ఇతను, తైవాన్ ఫాక్స్కాన్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. చైనీస్ నగరం షెన్జెన్ దక్షిణ ద్వీపకల్పంలో ఫాక్స్కామ్లో టెస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎనిమిది మంది సహాయంతో, సుమారు 6వేల ఐఫోన్5, ఐఫోన్ 5ఎస్ ఫోన్లను స్మగుల్ చేయించాడు.  టిసాయి, అతని సహచరులు కలిసి టెస్టింగ్కు వచ్చిన ఐఫోన్లను దొంగతనం చేసినట్టు తెలిసింది. కంపెనీ ఇంటర్నల్ ఆడిట్లో తైవనీస్ అధికారులు ఇది బయటపెట్టినట్టు ఫాక్స్ కాన్ చెప్పింది. నమ్మక ద్రోహం చేసినందుకు ఇతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవల కాలంలోఇతను కార్మిక వివాదాలకు తెరతీస్తూ ఉద్యోగులపై దుష్ఫర్తనకు పాల్పడినట్టు కూడా విచారణలో తెలిసింది.  

 

మరిన్ని వార్తలు