తాజ్మహల్ పురావస్తు శాఖ ఆస్తి: బాజపేయి

8 Dec, 2014 20:40 IST|Sakshi
తాజ్మహల్ పురావస్తు శాఖ ఆస్తి: బాజపేయి

బర్లాంపూర్(యూపీ): తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డుకు అప్పగించరాదని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజపేయి డిమాండ్ చేశారు. ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ పురావస్తు శాఖకు చెందుతుందని చెప్పారు.

'తేజోమహాలయ ఆలయ భూమిలోని కొంతభాగాన్ని రాజా జాయ్ సింగ్ నుంచి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డుకు అప్పగించకూడదు. ఇది భారత పురావస్తు శాఖకు చెందిన ఆస్తి. బ్రిటీషు ప్రభుత్వం 1920లో దీన్ని పురావస్తు శాఖకు అప్పగించింది' అని లక్ష్మీకాంత్ బాజపేయి పేర్కొన్నారు.

తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని వార్తలు