అమ్మకోసం మరో సింహాసనం

12 Dec, 2016 14:48 IST|Sakshi
అమ్మకోసం మరో సింహాసనం

చెన్నై: అసాధారణ వ్యక్తిత్వం..పోరాట పంథాతో తుదికంటూ పోరాడి దేశ రాజకీయాల్లో  తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళా రాజకీయవేత్త  తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత.  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ డిశంబర్ 5న అమ్మ కన్నుమూయడం  తమిళ  ప్రజలతో  పాటు పలు వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. కథానాయకిగా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవనాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సినీ రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా  నివాళు లర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర  కథానాయికలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు.  హీరోయిన్లు గౌతం వాసు దేవ్ మీనన్,  రాధిక, త్రిష, శృతి హాసన్ తదితరులు  ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు.

స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని  హీరోయిన్ త్రిష  ట్వీట్ చేశారు.  తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి   జయలలిత అంటూ ఆమె  సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం  అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు.  అతి ధైర్యవంతమైన మహిళల్లో  జయలలిత ఒకరని  శృతి హాసన్ ట్వీట్ చేశారు.  తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.

ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ  ప్రముఖ  నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు.  ముఖ్యమంత్రి జయలలిత  మరణం తమిళ  ప్రజలకు తీరని లోటు..కానీ  వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని  రాధిక ప్రార్థించారు.
మరోవైపు తమిళనాడుకేకాదు...యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్  ట్విట్టర్  ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు.  బల్గేరియాలో  షూటింగ్ లో  ఉన్న అజిత్ కుమార్   అమ్మ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  జీవితంలో అనేక యుద్ధాల్లో  పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయంలో ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం  ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు.
తనకు  అత్యంత ఇష్టమైన వ్యక్తి  జయలలిత అనీ హీరోయిన్ త్రిష  సంతాపం ప్రకటించారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఆమెను కలవడం ఒక అదృష్టమనీ, ఇందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ జయలలితను  కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు.  అతి ధైర్యవంతమైన మహిళల్లో  జయలిలత ఒకరని  మరో హీరోయిన్  శృతి హాసన్ ట్వీట్ చేశారు.
తమిళనాడు ఒక సాహసోపేతమైన మహిళా నాయకురాల్ని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ  ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు.  ఆమె మరణం తమిళ  ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వీరందరితో పాటు  పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి తదితర పలువురు సినీ ప్రముఖులు  జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసారు.

>
మరిన్ని వార్తలు