అంతా చట్టాల ఉల్లం‘ఘనులే’

7 Jan, 2014 01:27 IST|Sakshi

న్యూఢిల్లీ: గనుల తవ్వకాల్లో పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘించిన 70 కంపెనీల్లో సెరుుల్, టాటా స్టీల్, ఎస్సెల్ మైనింగ్ (ఆదిత్య బిర్లా గ్రూప్), ఒడిశా మైనింగ్ వంటి బడా సంస్థలున్నట్లు జస్టిస్ ఎం.బి.షా కమిషన్ తెలియజేసింది. ‘ఒడిశాలో 1994-95 నుంచి అటవీ, పర్యావరణ చట్టాల ఉల్లంఘన భారీ ఎత్తున కొనసాగింది. లీజుదారుల్లో అత్యధికులు ఈ చట్టాలను ఏదో ఒక రూపంలో ఉల్లంఘించారు. రూ.45,453 కోట్ల విలువైన ఇనుప ఖనిజం, రూ.3,089 కోట్ల వూంగనీస్‌ను అక్రవుంగా తవ్వేశారు. రాష్ట్రంలో ఇనుప ఖనిజం, వూంగనీస్ తవ్వకానికి 192 లీజులు జారీచేయుగా, 94 గనులకు పర్యావరణ అనువుతి (ఈసీ) లేదు. వీటిలో 78 గనుల్లో 1994-95, 2011-12 వుధ్యకాలంలో వేలాది కోట్ల రూపాయుల విలువైన వూంగనీస్, ఇనుప ఖనిజాలను అక్రవుంగా కొల్లగొట్టారు. ఈసీ ఆలస్యంగా జారీఅరుున 96 లీజు కంపెనీలు ఆ వ్యవధిలోనూ తవ్వకాలు కొనసాగించారుు..’ అని కమిషన్ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు