ప్రధాని చెంతకొచ్చిన మిస్త్రీ రగడ!

30 Oct, 2016 08:53 IST|Sakshi
ప్రధాని చెంతకొచ్చిన మిస్త్రీ రగడ!
న్యూఢిల్లీ : టాటా గ్రూప్లో వారం రోజులుగా జరుగుతున్న మిస్త్రీ రగడ, ప్రధాని చెంతకు చేరింది. టాటా సన్స్కు తాత్కాలిక చైర్మన్గా ఎన్నికైన రతన్ టాటా, గ్రూప్ చైర్మన్ పదవి అర్థాంతరంగా బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీలు విడివిడిగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మోదీని సైరస్ మిస్త్రీ గురువారం కలువగా.. రతన్ టాటా శుక్రవారం 20 నిమిషాల పాటు ప్రధానితో సమావేశమయ్యారు. మిస్త్రీ తనను ఏకపక్షంగా టాటా సన్స్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించిన వైనంపై మోదీకి వివరించగా..  బోర్డు స్థాయిలో జరుగుతున్న మార్పులపై రతన్ టాటా వివరించినట్టు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.  మోదీతో భేటీ అయిన రోజే రతన్ టాటా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు.
 
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించిన సైరస్ మిస్త్రీ వైఖరి, కీలక నిర్ణయం తీసుకోవడం దోహదం చేసిన కారకాలను జైట్లీకి టాటా తెలిపినట్టు సమాచారం.  టాటా బోర్డు సోమవారం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ గ్రూప్పై మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ప్రస్తుతం కార్పొరేట్, రాజకీయ వర్గాలను కుదుపేస్తున్నాయి. తనకు రతన్ టాటా పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, బిలియన్ డాలర్ల సంస్థగా పేరొందిన టాటా గ్రూప్, పలు నిర్ణయాలు తీసుకోవడంలో తప్పిదాలకు పాల్పడిందని మిస్త్రీ ఆరోపించారు. కాగ, కొత్త చైర్మన్ ఎంపికను చేసేందుకు సెర్చ్ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. నాలుగు నెలల్లో కొత్త చైర్మన్ను ఆ కమిటీ నియమించనుంది. ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా వ్యవహరిస్తున్నారు. 
మరిన్ని వార్తలు