టాటా మోటార్స్‌ షాక్‌: 1500 మేనేజర్లపై వేటు

24 May, 2017 16:51 IST|Sakshi
టాటా మోటార్స్‌ షాక్‌: 1500 మేనేజర్లపై వేటు

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స  షాకింగ్‌  న్యూస్‌ చెప్పింది.  తన వర్క్ఫోర్స్‌ లో  టాప్‌  ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది.  మేనేజర్‌  స్థాయిలో దాదాపు 1500 మంది ఉద్యోగులనుతొలగించనున్నట్టు బుధవారం ప్రకటించింది.  దేశీయంగా  సంస్థ పునర్నిర్మాణంలో భాగంగాఈ కోతలని  తెలిపింది. 

వైట్‌ కాలర్‌ ఉద్యోగులకు సంబంధించి  10-12 శాతం (సుమారు1500)మందిని  తొలగిస్తున్నట్టు టాటా  మోటార్స్‌  ఎండీ, సీఈవో గుంటెర్‌ బుచ్చక్ ప్రకటించారు. టాటా మోటార్స్‌ వార్షిక ఫలితాల సందర్భంగా ఆయన వివరాలను తెలిపారు. అలాగే బ్లూకాలర్‌ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులులేవని  స్పష్టం చేశారు. అయితే పనితీరు మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సి రామకృష్ణన్  తెలిపారు. ఇది నిర్వహణ ఖర్చుల తగ్గింపులో భాగ కాదని వివరణ ఇచ్చారు.  వీరిలో  కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని  ఎంచుకున్నారనీ, మరికొంతమందిని ఇతర విభాగాలను బదిలీ చేసినట్టు చెప్పారు.
కాగా  2016-17 క్యూ4లో టాటా మోటార్స్ బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో జేఎల్‌ఆర్‌ నికర లాభం 18 శాతం ఎగసి 55.7 కోట్ల పౌండ్లను తాకగా.. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది.    టాటా మోటార్స్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన  17 శాతం క్షీణించి రూ. 4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లను తాకింది.ఈ నేపథ్యంలో  ఒడిదుడుల మార్కెట్లో  టాటా మోటార్స్‌  షేరు భారీ లాభాలతో టాప్‌ విన్నర్‌ గా నిలిచింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా