టాటామోటార్స్ లాభాల్లో క్షీణత.. షేర్ జంప్

26 Aug, 2016 15:57 IST|Sakshi


ముంబై:  ప్రముఖ మోటారు వాహనాల ఉత్పత్తి సంస్థ టాటామోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూ1  ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించిది.  కన్సాలిడేటెడ్ నికరలాభంలో క్షీణతను నమోదు చేయగా మొత్తం ఆదాయంలో  వృద్ధిని సాధించింది.  గత ఏడాది రూ.5,254  కోట్ల లాభాలతో పోలిస్తే నికర లాభాల్లో 57శాతం క్షీణించి రూ. 2,260 కోట్లుగా నమోదైంది. విక్రయాల్లో 10 శాతం వృద్ధిని సాధించి రూ. 66,101 కోట్లను ఆర్జించింది. మొత్తం ఆదాయం  9 శాతం పెరిగి రూ. 67,230 కోట్లుగా నమోదుచేసింది.  గత ఏడాది జూన్ 30, 2015 తో ముగిసిన త్రైమాసికంలో ఇది 61,734 కోట్లుగా ఉంది.   నిర్వహణ లాభం(ఇబిటా) 31 శాతం క్షీణించి రూ. 7613 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 17.9 శాతం నుంచి 11.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు రూ. 1649 కోట్ల నుంచి రూ.720 కోట్లకు తగ్గగా, ఇతర ఆదాయం కూడా రూ. 220 కోట్ల నుంచి రూ. 174 కోట్లకు క్షీణించింది.  అయితే  మార్కెట్ లో టాటా మోటార్స్ షేర్ 4 శాతం జంప్ అయింది.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు