జత కట్టబోతున్న ఆటో దిగ్గజాలు

22 Feb, 2017 11:00 IST|Sakshi
జత కట్టబోతున్న ఆటో దిగ్గజాలు
న్యూఢిల్లీ : రెవెన్యూలో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, వాల్యుమ్లో అతిపెద్ద యూరప్ కార్ మేకర్ ఫోక్స్ వాగన్ రెండూ జతకట్టబోతున్నాయి. ఈ రెండూ భాగస్వామ్యం కుదుర్చుకునే ఒప్పంద చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటి భాగస్వామ్యం భారత్ , ఇతర వర్దమాన దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అయితే ఈ భాగస్వామ్యం జాయింట్ వెంచర్ లేదా టెక్నాలజీ టై-అప్ గా ఉండొచ్చని ఆటో వర్గాలు పేర్కొంటున్నాయి.
 
ప్రస్తుతం ఈ పార్టనర్ షిప్పై చర్చలు కొనసాగుతున్నాయని, మార్చిలో జరుగబోయే జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో దీన్ని ప్రకటించవచ్చని సమాచారం.  వెహికిల్ ఆర్కిటెక్చర్ షేరింగ్, టెక్నాలజీ అనేవి ఈ చర్చలకు ప్రధాన అంశంగా దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్లలో మోడ్యులర్ ప్లాట్ ఫామ్లను షేర్ చేసుకునేందుకు ఈ కంపెనీలు యోచిస్తున్నాయని తెలుస్తోంది. 
>
మరిన్ని వార్తలు