టాటా స్టీల్ నుంచీ మిస్త్రీ ఔట్!

12 Dec, 2016 15:11 IST|Sakshi
టాటా స్టీల్ నుంచీ మిస్త్రీ ఔట్!
టాటా పవర్, టాటా కెమెకిల్స్ అనంతరం టాటా స్టీల్ కూడా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై వేటు వేసింది. శుక్రవారం ఏర్పాటుచేసిన అత్యవసర బోర్డు సమావేశంలో టాటా స్టీల్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని  తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఓపీ భట్‌ను డిసెంబర్ 21 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించనున్నట్టు టాటా స్టీల్ బోర్డు పేర్కొంది. చైర్మన్ పదవితో కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా కూడా ఆయనకు ఉద్వాసన పలుకనున్నట్టు బోర్డు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయనతో పాటు మిస్త్రీకి వంత పాడుతున్న నుస్లీ ఎన్ వాడియాను కూడా కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా తొలగించేందుకు బోర్డు నిర్ణయించింది. 
 
దీనికోసం డిసెంబర్ 21న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్టు బోర్డు పేర్కొంది. ఈ సమావేశంలోనే బోర్డు చైర్మన్‌ను నియమించనున్నారు. మెజారిటీ బోర్డు మెంబర్లు మిస్త్రీని చైర్మన్‌గా తొలగించేందుకు మొగ్గుచూపినట్టు టాటాస్టీల్  పేర్కొంది. అయితే టాటా గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మిస్త్రీని గ్రూప్‌లోని మిగతా కంపెనీల చైర్మన్‌గా కూడా తొలగించాలని నిర్ణయించిన టాటా సన్స్, ఈ మేరకు కంపెనీలు బోర్డు సమావేశాల్లో ఆయనపై వేటు వేయాలని ఆదేశిస్తూ ఓ నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు టాటా పవర్, టాటా కెమెకిల్స్ ఇప్పటికే మిస్త్రీని చైర్మన్‌గా తొలగించాయి.  
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు