టాటాల మరో కీలక అడుగు?

28 Oct, 2016 13:37 IST|Sakshi
టాటాల మరో కీలక అడుగు?

టాటా గ్రూప్ లోసైరస్ మిస్త్రీ తొలగింపు  దుమారం చల్లారకముందే  టాటాలు కీలక పావులు కదుపుతున్నారు.  ఈ వివాదంలో మిగిలిన కార్యక్రమాలను చకచకా చక్క పెట్టే పనిలో  టాటా గ్రూప్ బిజీగా ఉంది. ముఖ్యంగా టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం  షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారులకోసం  ప్రయత్నాలు మొదలు పెట్టింది.  టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి  18 శాతం వాటాను విక్రయించాలనుకుంటే... ఆసక్తిగల  ఫ్రెండ్లీ  పార్టనర్స్ కోసం  వెతుకుతోందని బ్లూమ్ బర్గ్  రిపోర్టు చేసింది.
 సమర్థవంతమైన కొనుగోలుదారులకోసం ప్రాథమిక చర్చలు మొదలు పెట్టిందని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే టాటాలు  మిస్త్రీ కుటుంబం వాటాను కొనుగోలుకు ఆసక్తి వున్న సావరిన్ హెల్త్ ఫండ్ (ప్రభుత్వ ఆధీనంలో ఇన్వెస్ట్మెంట్ ఫండ్) ఇతర దీర్ఘకాల పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు  నివేదించింది.  టాటా సన్స్ లిస్టెడ్ కంపెనీలో 65 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది.
అయితే ఈవార్తలను ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోత్రా ఖండించారు. ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదనీ, మిస్త్రీ తన పోరాటాన్ని వదులుకోరని వ్యాఖ్యానించారు.  ఈ వార్తలపై  వ్యాఖ్యానించడానికి టాటాసన్స్, షాపూర్జీ పల్లాంజీ  గ్రూపు తిరస్కరించాయి.

కాగా టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి అకస్మాత్తుగా ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్ లోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ షాపూర్జీ , పల్లోంజి గ్రూప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
,

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు