టాటూలతో క్యాన్సర్‌!

20 Aug, 2016 23:07 IST|Sakshi
టాటూలతో క్యాన్సర్‌!

లండన్: టాటూలు వేయించుకోవడాన్ని ఈ తరం యువత ఫ్యాషన్ గా భావిస్తోంది. అయితే ఈ టాటూల ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. టాటూలు వేయించుకుంటున్నవారిలో దాదాపు 5 శాతం మంది చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. టాటూలు ఎక్కువకాలం ఉండేందుకు చర్మంలోకి కొన్నిరకాల రసాయనాలను పంపుతారు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇక టాటూల ద్వారా చర్మ క్యాన్సర్‌ వస్తుందన్న విషయంపై కూడా శాస్త్రవేత్తలు ఎటువంటి క్లారిటీని ఇవ్వలేకపోతున్నారు. కేవలం టాటూల ద్వారానే చర్మ క్యాన్సర్‌ వస్తుందనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని, అయితే రాదనే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. టాటూలకు ఉపయోగించే 60 శాతం కలర్లు క్యాన్సర్‌ కారకాలేనని, లేజర్‌ కిరణాలను కూడా ఉపయోగించడం ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చ టాటూలతో పోలిస్తే ఎర్ర, నల్ల టాటూలో ఎక్కువ దుష్ఫలితాలు పొంచి ఉన్నాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు