టీసీఎస్‌ బై బ్యాక్‌ ఆఫర్‌ మే 18-31 వరకు

15 May, 2017 19:09 IST|Sakshi

ముంబై:   దేశీయ  అతిపెద్ద  టెక్‌ సేవల సంస్థ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  ఇటీవల ప్రకటించిన బై బ్యాక్‌ను   ప్రారంభించనుంది.  గత నెల వాటాదారుల ఆమోదం పొందిన  వాటా పునర్ కొనుగోలు కార్యక్రమం మే 18 న  మొదలుపెట్టనుంది.  ఈ  ఆఫర్‌ మే 31ముగియనుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.  పరిశ్రమలో అతి పెద్ద బైబ్యాక్‌గా  చెబుతున‍్న టీసీఎస్ రూ. 16 వేల కోట్ల ఆఫర్ ను వాటా దారులకు అందించనుంది. . 2012లో రూ. 10,400 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ బైబ్యాక్ చేసింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం కాగా, ఇప్పుడీ మొత్తాన్ని టీసీఎస్ అధిగమిస్తుండడం విశేషం.

మరోవైపు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తప కాపిటల్‌ అలొకేషన్‌ లో భాగంగా  ఈ ఆర్థిక సంవ్సతరంలో రూ.13వేల  కోట్ల రూపాయల   బై బ్యాక్‌ను ప్రకటించింది.ఈ ఏడాది ప్రారంభంలో, కాగ్నిజాంట్  3.4 బిలియన్ల డాలర్ల వాటాల పునర్ కొనుగోలును ప్రకటించింది,   హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ .3,500 కోట్ల విలువైన 3.50 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.

 ఏప్రిల్‌లో షేర్‌హోల్డర్ల నుంచి బైబ్యాక్‌కు అనుమతులు పొందగా మే 18 నుంచి ప్రారంభించి, మే 31వరకు కొనసాగించనున్నట్లు టీసీఎస్ సమాచారం ఇచ్చింది. అర్హత గలిగిన షేర్ హోల్డర్లకు లెటర్ ఆఫ్ ఆఫర్‌ను మే 16 నుంచి లేఖల ద్వారా పంపనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే  బోర్డ్‌ డైరెక్టర్‌ విజయ​ కేల్కర్‌ పదవీ కాలం  మే 14న ముగిసిందని  మరో ప్రకటనలో తెలిపింది.  టిసిఎస్ సంస్థ  పదవీ విరమణ వయస్సు విధానానికి అనుగుణంగా ఈ పరిణామామని ప్రత్యేక ఫైలింగ్‌లో తెలిపింది.  
ఫిబ్రవరిలో టిసిఎస్ బోర్డు రూ .16,000 కోట్ల మినహాయింపు కోసం 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఆమోదించింది.

కాగా ఫిబ్రవరిలో టిసిఎస్ బోర్డు రూ .16,000 కోట్ల మేర 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఆమోదించింది. ప్రస్తుతం   ముంబై ఆధారిత కంపెనీ టీసీఎస్ వద్ద రూ. 43,619 కోట్ల నగదు నిల్వలుండగా.. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఇది 10 శాతంగా  ఉంది.
 

మరిన్ని వార్తలు