ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్....

26 Feb, 2017 14:28 IST|Sakshi
ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్....
న్యూఢిల్లీ : టాప్-3 ప్రపంచ ఐటీ బ్రాండ్సులో చోటు దక్కించుకున్న ఐటీ దిగ్గజం టీసీఎస్ దేశీయ మార్కెట్లో తన లీడర్ షిప్ పొజిటిష్పై పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తోంది. ఐదేళ్ల తర్వాత కూడా కంపెనీ మరింత స్ట్రాంగ్ గానే మారుతుందని టీసీఎస్ కొత్త సీఈవో రాజేష్ గోపినాథన్ భరోసా వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగంలో సాంకేతికను అందిపుచ్చుకోవడంతో తాము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఇండియాలో తామెప్పుడూ లీడర్లమేనని రాజేష్ గోపినాథన్ పేర్కొన్నారు. మరే ఇతర ఐటీ కంపెనీలకు రాని రెవెన్యూలను తమకు వస్తున్నాయని, రెవెన్యూల్లో తామే అతిపెద్ద షేర్ను ఆర్జిస్తున్నట్టు తెలిపారు.
 
ముంబాయి ప్రధాన కార్యలయంగా నడుస్తున్న ఈ కంపెనీ పొందే 6 శాతం గ్లోబల్ రెవెన్యూలో ఎక్కువ శాతం ఇండియా నుంచే వస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్  ప్రస్తుతమున్న దానికంటే మరింత స్ట్రాంగ్గానే మారుతుందని గోపినాథ్ తన విజన్ను వివరించారు. దేశంలో డిజిటల్ సదుపాయాలను మరింత విస్తరించడానికే కంపెనీ ముందంజలో ఉంటుందని చెప్పారు. కంపెనీ ముందున్న అతిపెద్ద సవాళ్లలో డిజిటల్ ఒకటని పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు