పొత్తుల్లో కత్తులు!

19 Jan, 2016 05:08 IST|Sakshi
పొత్తుల్లో కత్తులు!

బీజేపీ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుపై ప్రతిష్టం భన కొనసాగుతూనే ఉంది. నామినేషన్లకు గడువు పూర్తయిన మరునాటికి పరిస్థితిని చూసి బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నేతలపై ద్వితీ య శ్రేణి నేతలు, ఆశావహులు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. పొత్తులో భాగంగా డివిజన్లను పంచుకున్నా రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పొసగడం లేదు. బీజేపీకి వచ్చిన పలు సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

టీడీపీకి కేటాయించిన సీట్లలోనూ  బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే బీజేపీకి కేటాయించిన ఎక్కువ సీట్లలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉండటంతో పొత్తులపై పరస్పరం నీలిమేఘాలు అలుముకొన్నా యి. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినా, నామినేషన్లకు గడువు పూర్తయినా ఏ సీటు ఎవరికిపోతుందో, అభ్యర్థులు ఎవరుం టారో తెలియని పరిస్థితి బీజేపీ, టీడీపీలో ఉంది. ‘పార్టీలో పనిచేసిన వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనే యోచ న రాష్ట్ర నాయకత్వానికి లేదు. హైదరాబాద్‌లోనూ పార్టీకి పునాదులు లేకుండా పోయే దుస్థితి కనబడుతోంది’ అని బీజేపీ సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు.

గ్రేటర్‌లోని 150 స్థానాల్లో బీజేపీకి 63 బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీకి ఇచ్చిన సీట్లలోనూ టీడీపీ నేతలు నామినేషన్లు వేశారు. ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లిని బీజేపీకి కేటాయించ గా, అక్కడ నలుగురు టీడీపీ నేతలు నామినేషన్లు వేశారు. ఇదే పరిస్థితి కాప్రాలోనూ. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి కేటాయిం చిన అడిక్‌మెట్, బోలక్‌పూర్, గాంధీనగర్ డివిజన్లలోనూ టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మల్కాజిగిరిలోనూ ఇంతే. బీజేపీకి కేటాయించిన వెంకటాపురం, మౌలాలి, ఆనంద్‌బాగ్‌లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక, బౌద్ధనగర్ డివిజన్లలోనూ అంతే.

మరిన్ని వార్తలు