లంచ్‌కు రూ.50.. బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.30

22 Mar, 2017 11:54 IST|Sakshi

న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వే శాఖ విడుదలచేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలుచేస్తున్నా నాసిరకం పదార్థాలు వడ్డిస్తున్నారని ప్రయాణికుల నంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేటరింగ్‌ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీనిలో... అల్పాహారం–రూ.30, నాన్‌వెజ్‌ అల్పాహారం–రూ.35, లంచ్, డిన్నర్‌(వెజ్‌)–రూ.50, నాన్‌వెజ్‌ లంచ్, డిన్నర్‌–రూ.55,ప్యాకెజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌(1లీ.)–రూ.15, కాఫీ,టీ– రూ.7గా నిర్ణయించారు.

జాబితాలో పేర్కొన్న ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తరువాత ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు