విభజన ప్రక్రియపై జీవోఎం సమీక్ష

21 Mar, 2014 13:13 IST|Sakshi
విభజన ప్రక్రియపై జీవోఎం సమీక్ష

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నేడిక్కడ సమావేశమయింది. జీవోఎం సభ్యులు సుశీల్కుమార్ షిండే, జైరాం రమేష్‌ ఈ భేటీకి హాజరయ్యారు. విభజన ప్రక్రియ, ఆస్తులు, అప్పులు, వనరులు, ఉద్యోగుల పంపిణీపై సమీక్ష జరపనున్నారు. సీమాంధ్ర రాజధాని ఎంపికకు ఏర్పాటు చేయాల్సిన నిపుణుల కమిటీపై చర్చించే అవకాశముంది.

గవర్నర్ నరసింహన్కు సలహాదారులను నియమించే విషయంపై కూడా జీవోఎం సభ్యులు దృష్టిసారించనున్నారని సమాచారం. హైదరాబాద్లో పర్యటించి వచ్చిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సమర్పించే నివేదికపై కూడా జీవోఎం సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా