తెలంగాణ తొలి మిస్ ఇండియాగా గర్వంగా ఉంది

15 Sep, 2015 05:08 IST|Sakshi
తెలంగాణ తొలి మిస్ ఇండియాగా గర్వంగా ఉంది

వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలో తొలి మిస్ ఇండి యా టైటిల్‌ను సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవా రం వరంగల్ స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయిత్రి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముంబై, ఢిల్లీ నుంచి హీరోయిన్‌లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు అమ్మాయిలు అందం గా, కావాల్సిన అన్ని అర్హతలతో సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. మోడలింగ్‌పై అనేక రకాలైన అపోహలున్నాయన్నారు. అన్ని రంగాల్లో ఉన్నట్లుగా మోడలింగ్‌లో ఉన్నాయని, గ్లామ ర్ ఫీల్డ్ కావడంతో ఎక్కువ చర్చజరుగుతుందన్నారు. అభిరుచులకు తల్లిదండ్రులు పాధాన్యం కల్పిస్తూ, ప్రోత్సహించాల ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా సాయంచేస్తే మోడలింగ్‌పై శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో మోడలింగ్ సంస్థలు ఉన్నందున కరీంనగర్ లేదా వరంగల్‌లో నెల కొల్పుతానన్నారు. సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశలు వస్తున్నాయన్నారు. త్వరలో వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గృహిణిగా తన ప్రస్తానం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళలకు అదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూనూరు శేఖర్ గౌడ్, సదానందం పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు