గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు

13 Dec, 2013 20:17 IST|Sakshi

హైదరాబాద్:  రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ మంత్రులు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ గౌరవిస్తారంటూ మంత్రులు డీకే అరుణ, సునీత, చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

అసెంబ్లీకి ఇవాళ తెలంగాణ బిల్లు రాకపోవడం వెనుక సీఎం కిరణ్ హస్తమేమీ లేదని దిగ్విజయ్ అన్నట్టు మంత్రులు తెలపారు. సోమవారం బీఏసీ భేటీలో బిల్లు చర్చకు వస్తుందిని, మంగళవారం నుంచే బిల్లుపై సభలో చర్చించేలా పట్టుబడతామని తెలంగాణ మంత్రులు డీకె అరుణ, సునీత, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు