'విభజన ఆలస్యంతో అనుమానాలు'

11 Aug, 2015 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టును విభజించాలని కోరుతూ తెలంగాణ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. హైకోర్టు విభజన ఆలస్యం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మనస్పసర్థలు, అనుమానాలు తలెత్తుతాయని రాజ్ నాథ్ కు తెలిపారు.

న్యాయశాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని రాజ్ నాథ్ హామీయిచ్చారని తెలంగాణ ప్రతినిధులు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా హైకోర్టు విభజన ఆలస్యం అవుతుందనే అభిప్రాయంతో కేంద్రం ఉందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి అటార్నీ జనరల్ ద్వారా వాదనలు వినిపించాలని కోరినట్టు వెల్లడించారు. రాజ్ నాథ్ ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రొఫెసర్ కోదండరాం, లాయర్ రాజేందర్ రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు