పరిశుద్ధ గంగమ్మ ఎక్కడ?

9 Oct, 2015 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో గంగానది పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం ఒక్కటైనా ఉంటే చెప్పగలరా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రశ్నించింది. గంగానది ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నదని నిట్టూర్పువిడిచింది. గంగానది ప్రక్షాళన, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవాహం సాగేవిధంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఖరి ఉదాసీనంగా ఉందని ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

'వాస్తవంలో ఏమీ జరుగడం లేదని మేం అనుకుంటున్నాం' అని పేర్కొంది. గంగానదిని కలుషితం చేస్తున్న పారిశ్రామిక యూనిట్లపై చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ గతంలోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో ఇది తమ బాధ్యత కాదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు