'ఆగంతకుల రాతలు విచారకరం'

18 Feb, 2015 11:43 IST|Sakshi

వాషింగ్టన్: యూఎస్ లోని దేవాలయం గోడపై ఆగంతకుల రాతల పట్ల భారతీయ అమెరికా సమాజాం విచారం వ్యక్తం చేసింది. ఇది ఓ రకంగా జాత్యహంకార దాడి అని ఆ సమాజం అభివర్ణించింది. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విచారకరమని అభిప్రాయపడ్డింది. ఈ ఘటనను భారతీయ అమెరికా సమాజం ముక్త కంఠంతో ఖండించింది. యూఎస్ లోని భారతీయ సమాజం ముక్కు సూటిగా వ్యవహారిస్తుంది. అలాగే ఇతరులపై ప్రేమ, గౌరవం కలిగి ఉంటుందని హిందూ దేవాలయం ట్రస్టీ బోర్డు చైర్మన్ నిత్యా నిరంజన్ తెలిపారు.

భారతీయులు అత్యంత పర్వదినంగా భావించే శివరాత్రి వేడుకులకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ దారుణం ఎవరు చేశారో అర్థం కావడం లేదన్నారు. నిందితులను గుర్తించి శిక్షించే వరకు వదలబోమని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ప్రతినిధి జే కన్సారా స్పష్టం చేశారు.అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించామని... ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హిందు దేవాలయం గోడలపై సోమవారం ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి... గెట్ అవుట్ అని రాసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు