విశాఖ, చెన్నైలపై మరో 26/11 దాడి?

11 Sep, 2014 12:53 IST|Sakshi
విశాఖ, చెన్నైలపై మరో 26/11 దాడి?

భారతదేశం మీద మరో 26/11 తరహా దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. అయితే ఈసారి దక్షిణ భారతదేశాన్ని వాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, చెన్నై నగరాలు వాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగరాలకు చెందిన విలువైన సమాచారాన్ని కొలంబోలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో తన హ్యాండ్లర్లకు అందజేస్తున్న శ్రీలంక గూడచారి ఒకరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు అరెస్టు చేశాయి. అరుణ్ సెల్వరాజన్ అనే శ్రీలంక తమిళుడు చెన్నైలోని కలీక భద్రతా సంస్థల వీడియోలు, ఫొటోలు తీసి, వాటిని పాకిస్థానీ హ్యాండ్లర్లకు ఇచ్చినందుకు అరెస్టు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు కేంద్రం, ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ, కోస్ట్ గార్డ్ లాంటి కీలక కేంద్రాలన్నింటి వివరాలను సెల్వరాజన్ ఫొటోలు, వీడియోలు తీసినట్లు తెలుస్తోంది.

ఇతడు చెన్నైలో ఇటీవల ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను తెరిచి, దాని పేరుమీద ఈ అన్ని ప్రాంతాలకు వెళ్లాడు. సరిగ్గా 26/11 దాడికి ముందు డేవిడ్ హెడ్లీ ఇలాడే ఇమ్మిగ్రేషన్ సంస్థ పేరిట భారతదేశానికి వచ్చి పలు ప్రాంతాలను వీడియో తీసి లష్కరే తాయిబాకు అందించాడు. ఇప్పుడు అరుణ్ తప్పుడు పత్రాలతో భారత పాస్పోర్టు సంపాదించాడు.

అరుణ్ సెల్వరాజన్ విశాఖపట్నం కూడా వచ్చి ఇక్కడున్న పలు నౌకాదళ సంస్థలను కూడా ఫొటో తీసినట్లు సమాచారం. వీటిని తన ఈమెయిల్ అకౌంట్లో డ్రాఫ్ట్లుగా సేవ్ చేసి, కొలంబోలోని తన పాకిస్థానీ హ్యాండ్లర్లకు అందించేవాడు. ఈమెయిల్ పాస్వర్డ్ వాళ్ల వద్ద కూడా ఉండటంతో వాళ్లు ఇదే మెయిల్ను అక్కడ తెరుచుకుని వాటిని డౌన్లోడ్ చేసుకునేవారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

మరిన్ని వార్తలు