సాహసం ప్రదర్శించబోయి; వైరల్‌ వీడియో

16 Jun, 2017 20:47 IST|Sakshi
సాహసం ప్రదర్శించబోయి..

బ్యాంకాక్‌: ‘చనువిచ్చిందికదాని పులితో సెల్ఫీ దిగితే.. వేటాడేస్తద’ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏనాడో హితవుపలికాడు. థాయిలాండ్‌కు చెందిన ఈ వ్యక్తి వీడియో చూస్తే ఎన్డీఆర్‌ మాట నూరుశాతం నిజమని మరోసారి అనిపించకమానదు!

థాయిలాండ్‌లోని కోసముయి దీవిలో గల క్రొకడైల్‌ ఫామ్‌ గొప్ప టూరిస్ట్‌ స్పాట్‌. వేల సంఖ్యలో వచ్చే సందర్శకులను థ్రిల్స్‌ చేస్తూ అక్కడ నిత్యం క్రొకొడైల్‌ షోలు నిర్వహిస్తూఉంటారు. నీళ్లలోనుంచి మొసళ్లను బయటికి రప్పించి, వాటికి ముద్దులు పెట్టడం, దాని నోట్లో తలలు పెట్టడం లాంటి ఫీట్లు చేస్తుంటారు జూకీపర్లు.

అలా ఆ సాహసి ప్రదర్శన ఇస్తున్న సమయంలో మొసలి అమాంతం అతని తలను నోటకరుచుకుంది. ఎక్స్‌పీరియన్స్‌ ఉండబడ్డి వెంటనే తల లాగేసుకున్నాడుగానీ లేకుంటే ఈ పాటికి అతనికి ‘రామ్‌ నామ్‌ సత్య్‌ హై’ పాడాల్సి వచ్చేంది. స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. గత ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.