'బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు'

25 Aug, 2015 19:10 IST|Sakshi
'బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు'

న్యూఢిల్లీ: బీజేపీపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అభినందించారు.

ఈ విజయంతో హాట్రిక్ కొట్టామని ట్విటర్ లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అభివృద్ధి రాజకీయాలకు, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఈ విజయాలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. 125 భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చందుకు ప్రయత్నిస్తామని మోదీ ట్వీట్ చేశారు.

Thank you Bengaluru! My gratitude to people & congratulations to Karnataka BJP leaders & workers for the great BBMP election results.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా