ప్రజాభిప్రాయ సేకరణకు అపూర్వ స్పందన: ఆమ్ ఆద్మీ

17 Dec, 2013 22:28 IST|Sakshi
ప్రజాభిప్రాయ సేకరణకు అపూర్వ స్పందన: ఆమ్ ఆద్మీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుపై డిసెంబర్ 23 తేదిన తుది నిర్ణయం తీసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఎస్ఎమ్మెఎస్, వెబ్ సైట్, ఐవీఆర్ రూపంలో తమ అభిప్రాయాల్ని  ప్రజలు వెల్లడించాలని ఏఏపీ కోరింది. అయితే ఏఏపీ విజ్జస్తికి అపూర్వ స్పందన లభిస్తోందని ట్విటర్ లో వెల్లడించారు.  
 
కేవలం నాలుగు గంటల్లోనే వివిధ రూపాల్లో 3 లక్షల మెసేజ్ లు వచ్చాయని, వెబ్ సైట్ లోనే 35 వేల మంది స్పందించారని తెలిపారు. తమ అభిప్రాయాలను తెలుపడానికి 08806110335 నెంబర్ కు కాల్ చేయవచ్చని ఏఏపీ వెల్లడించింది. ఫోన్ చేసిన వ్యక్తి 'యస్' లేదా 'నో' అని చెప్పాలని తెలిపారు.  ప్రజలు 'యస్' లేదా 'నో' అని తమ అభిప్రాయన్ని వెల్లడించాలని ఆయన కోరారు. ఎక్కువ మంది ప్రజలు 'యస్' అంటే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రివాల్ తెలిపారు. 
 
ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఏఏపీ నేత అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. 70 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
 
అసెంబ్లీలో 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. 18 కీలక సమస్యలపై బేషరతుగా మద్దతు తెలుపాలని కాంగ్రెస్, బీజేపీలకు కేజ్రివాల్ లేఖ రాయగా, అందుకు 16 అంశాలకు మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ జవాబిచ్చింది. 
>
మరిన్ని వార్తలు