ఆదరించిన ఆలయానికి అండగా

2 Jun, 2017 09:53 IST|Sakshi
ఆదరించిన ఆలయానికి అండగా

ఆదరించిన ఆలయానికి.. ఓ యాచకుడు రూ.1.2 లక్షల విరాళం
భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణానికి నిర్ణయం

చీపురుపల్లి: ఆది భిక్షువు ఆలయం చెంతనే అరవై ఏళ్లుగాయాచన చేస్తూ జీవిస్తున్నాడు. తాను దాచుకున్న దానిలో రూ.1.2 లక్షలు ఇప్పుడు ఆ నీలకంఠుడి భక్తుల సౌకర్యానికే విరాళవిుచ్చాడు. ఆ యాచకుని పేరు చేబోలు కామరాజు. విజయనగరంజిల్లా చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయమే అతని చిరునామా. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. షెడ్లు లేక భక్తులు ఎండలో నిలబడాల్సి వస్తోందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

కమిటీ నిర్ణయం తెలుసుకున్నకామరాజు వాటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.1.2 లక్షలు తాను ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే బ్యాంకు నుంచి రూ. 60 వేలు తీసుకొచ్చి కమిటీ పెద్దలు, దేవాదాయశాఖ అధికారులకు అందజేశాడు. అంత డబ్బు ఒకేసారి ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నిరాకరించడంతో మరో రెండు రోజుల్లో మొత్తం సొమ్ము సమకూరుస్తానని చెప్పాడు. షెల్టర్లు పూర్తయ్యాక రూ.10 వేల ఖర్చుతో భక్తులకు అన్నదానం కూడా చేస్తానని తెలిపాడు.

ఆరు దశాబ్దాల క్రితమే చీపురుపల్లికి..
కామరాజుది శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామం. అతనికి20 ఏళ్ల వయసులో వివాహం కాగా.. కొంతకాలానికి భార్యమృతి చెందింది. మిగిలిన కుటుంబ సభ్యులు అతన్ని ఆదరిం^èlలేదు. దీంతో ఒంటరిగా అరవైఏళ్ల క్రితం చీపురుపల్లికివచ్చి శివాలయమే తన స్థిరనివాసంగా నిర్ణయించుకున్నాడు.ఆలయం ఎదుట చిన్న గుడారం వేసుకుని అక్కడే ఉంటూయాచన సాగిస్తున్నాడు.

 

మరిన్ని వార్తలు