ఉత్తరాఖండ్‌ సీఎంకు సీబీఐ సమన్లు

24 Dec, 2016 01:49 IST|Sakshi
ఉత్తరాఖండ్‌ సీఎంకు సీబీఐ సమన్లు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌కు సీబీఐ మళ్లీ సమన్లు జారీ చేసింది. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోపై విచారణలో భాగంగా తాజాగా సీఎంకు సీబీఐ సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 26న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియో బయటపడటంతో గతేడాది ఏప్రిల్‌ 29న సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.

ఇందులో భాగంగా మే 24న రావత్‌ను దాదాపు 5గంటలపాటు సీబీఐ ప్రశ్నించింది. అంతకుముందు బల పరీక్షలో రావత్‌ విజయం సాధించిన అనంతరం మే 15న రాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది. సీబీఐ విచారణను వెనక్కు తీసుకుని, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ దీనికి సీబీఐ విముఖత వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు