ఈ ఘనత నాది కాదు: మోదీ

4 Dec, 2015 11:30 IST|Sakshi
ఈ ఘనత నాది కాదు: మోదీ

న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో రాష్టాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను రాష్ట్రాలు ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు ఢిల్లీలోనే నిర్ణయించేవారని, తాము ఈ పరిస్థితిని మార్చామని చెప్పారు.

శుక్రవారం హిందూస్థాన్ టైమ్స లీడర్ షిమ్ సమిట్ లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పుడు మనదేశం అభివృద్ధి ఆగలేదని తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు.

దేశంలో ఇప్పటికి 18 వేల గ్రామాలకు కరెంట్ లేదని తెలిపారు. గత ప్రభుత్వాలు పనిచేయలేదని తాను చెప్పడం లేదని, 1000 రోజుల్లో గ్రామాలన్నింటికీ కరెంట్ అందిస్తామని హామీయిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు సజావుగా నడుస్తున్నాయని.. ఈ ఘనత తానొక్కడితే కాదని అన్ని పార్టీలకు చెందుతుందని నరేంద్ర మోదీ అన్నారు.
 

మరిన్ని వార్తలు