పత్తి రైతుకు గుర్తింపుకార్డు తప్పనిసరి

5 Oct, 2015 02:46 IST|Sakshi
పత్తి రైతుకు గుర్తింపుకార్డు తప్పనిసరి

మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో 84 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కనీస మద్దతు ధరపై పత్తి రైతులకు అవగాహన కల్పించేందుకు ‘రైతు సోదరులకు విజ్ఞప్తి’ పేరుతో వాల్ పోస్టర్‌ను ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. పత్తి రైతులు తమ వెంట పత్తిరైతు గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీల జిరాక్స్ ప్రతులను తప్పకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వాల్ పోస్టర్లను అన్ని మార్కెట్ యార్డులు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో అతికించాలన్నారు.

మరిన్ని వార్తలు