'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం

16 Oct, 2015 19:21 IST|Sakshi
'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం

న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. కాగా ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు తీర్పును సమర్థించగా, జస్టిస్ జే చలమేశ్వర్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. 4:1తో ధర్మాసనం ఈ తీర్పును ఆమోదించింది.

నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. రాజకీయ జోక్యం లేకుండా పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు