ఎంఎన్సీ వదిలాడు.. రూ.900కోట్లను ఆర్జించాడు!

22 Mar, 2017 14:35 IST|Sakshi
ఎంఎన్సీ వదిలాడు.. రూ.900కోట్లను ఆర్జించాడు!
ముంబై : డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ బంపర్ లిస్టింగ్ ప్రమోటర్లందర్ని ఒక్కసారిగా దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చేర్చింది. అతిరథ మహారథులందర్ని దాటేసి తమ సంపదను అమాంతం పెంచేసుకున్నారు. అయితే కేవలం ప్రమోటర్లను మాత్రమే కాక, ఇటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లకు మిలీనియర్ క్లబ్ లో చోటు కల్పించింది. బీఎస్ఈలో లిస్టింగ్ కు వచ్చిన డీమార్ట్ లాభాల ధమాకా మోగించడంతో కంపెనీ ఎండీ నవిల్ నోరోన్హా సంపద ఒక్కసారిగా రూ.900 కోట్లకు పెరిగిపోయిందట. నోరోన్హా అవెన్యూ సూపర్ మార్ట్స్ లో 1.37 కోట్ల షేర్లు కలిగిఉ‍న్నారు.
 
 
ప్రస్తుతం కంపెనీ షేర్లు రెండింతలు పెరగడంతో  ఆయన సంపద రూ.878 కోట్లకు పెరిగినట్టు రిపోర్టులు చెప్పాయి. హెచ్యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ వివేక్ గంభీర్ సంపదలన్నీ కలిపితే ప్రస్తుత నోరోన్హా సంపదని తెలిసింది. ఎస్ఐఈఎస్ కాలేజీ నుంచి నోరోన్హా సైన్యు గ్రాడ్యుయేట్ గా పట్టా పొందారు. అనంతరం నార్సి మాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హెచ్యూఎల్ లో మార్కెట్ రీసెర్చ్, సేల్స్, మోడరన్ ట్రేడ్ లో పనిచేసే సమయంలోనే దమానీతో సానిహిత్యం పెరిగింది. అనంతరం డీ-మార్ట్ విస్తరణలో భాగంగా నోరోన్హా ఆ మల్టినేషనల్ దిగ్గజానికి బై చెప్పి, డీ-మార్ట్ లో చేరారు.   
 
మరిన్ని వార్తలు