‘కొత్త జిహాదీ జాన్’గా భారత సంతతి వ్యక్తి

6 Jan, 2016 09:42 IST|Sakshi
‘కొత్త జిహాదీ జాన్’గా భారత సంతతి వ్యక్తి

లండన్: ‘కొత్త జిహాదీ జాన్’గా భారత సంతతి వ్యక్తి ఉగ్రవాద వీడియోల్లో ప్రత్యక్షమయ్యాడు. మాస్క్ ధరించి ఉగ్రవాద వీడియోల్లో భయానకంగా కనిపిస్తూ మాట్లాడే వ్యక్తిని బ్రిటన్ మీడియా ‘జిహాదీ జాన్’గా అభివర్ణిస్తోంది. బ్రిటన్‌లో బీభత్స ఘటనలకు పాల్పడనున్నట్లు చెబుతున్న ఓ వీడియోను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆదివారం విడుదల చేసింది. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి బ్రిటన్‌కు చెందిన భారత సంతి ముస్లిం సిద్ధార్థ ధర్‌గా బ్రిటన్ పోలీసులు  గుర్తించారు. సిద్ధార్థ అలియాస్ అబు రుమేసహ్.. భార్య, నలుగురు పిల్లలతో 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరాడు.

హిందువు అయిన ఇతను వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వెళ్లి.. అక్కడ ఇస్లాం మతం స్వీకరించాడు. ఇంగ్లాండ్‌లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్‌లో చేరాడు. అక్కడి నుంచి సిరియా వెళ్లి ఐసిస్‌తో చేతులు కలిపాడు. కాగా ధర్ వీడియోను అతని తల్లి, చెల్లెలు కూడా వీక్షించారు. అయితే అది తన కొడుకు గొంతా? కాదా? అన్నది చెప్పలేనని శోభితా ధర్ పేర్కొన్నారు. వీడియో గొంతు గుర్తుపట్టేలా లేదని.. ఇది తనను షాక్‌కు గురిచేసిందని ధర్ సోదరి కోనికా చెప్పారు.

మరిన్ని వార్తలు