చింపాంజి అంటూ కామెంట్

28 Dec, 2016 15:30 IST|Sakshi
చింపాంజి అంటూ కామెంట్
అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ మహిళ ఉద్యోగం ఊడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత తనకు ఆనందంగా ఉందని ఇప్పటివరకూ ప్రథమ పౌరురాలి స్ధానంలో ఓ చింపాంజిని  చూడాల్సివచ్చిందని క్లే కౌంటీ డెవలప్ మెంట్ కార్ప్ అనే నాన్ ప్రాఫిట్ సంస్ధకు డైరెక్టర్ గా పనిచేస్తున్న పమిలా టేలర్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో అమెరికాలో దుమారం రేగింది. ఆ సంస్ధ కార్యాకలాపాలపై దృష్టి సారించిన అధికారులు పలు చోట్ల నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించారు.
 
ప్రభుత్వ సాయం పొందుతున్న సంస్ధలో నియమావళి ఉల్లంఘన కారణంగా సదరు సంస్ధను రద్దు చేయడం లేదా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడమో జరుగుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆరు నెలల పాటు సంస్ధ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఓ ఏజెన్సీని నియమించింది. గత నెలలో మిషెల్లీ ఒబామాను వెస్ట్ వర్జీనియాకు మేయర్ బెవర్లీ వాలింగ్స్ చింపాంజితో పోల్చారు. వాలింగ్స్ పోస్టుతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్లు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వాలింగ్స్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
>
మరిన్ని వార్తలు