ఈ దేశాల్లో ఐఫోన్లు చాలా ఖరీదైనవి!

31 Dec, 2016 11:22 IST|Sakshi
ఈ దేశాల్లో ఐఫోన్లు చాలా ఖరీదైనవి!
ఐఫోన్ బ్రాండు అంటేనే.. కొంచెం ఖరీదైనది. వాటిని కొనాలంటే డబ్బులెక్కువ వెచ్చించాల్సిందే. అయితే బ్రెజిల్, ఇండియా, స్వీడన్, డెన్మార్క్ లేదా ఇటలీ వెళ్లినప్పుడు అసలు ప్రయాణికులు తమ ఐఫోన్లను చేజార్చుకోవద్దని డ్యుయిస్ బ్యాంకు చెబుతోంది. ఎందుకో తెలుసా? ఈ దేశాల్లో ఐఫోన్ ధరలు భారీగా ఉంటాయట. ఒకవేళ ఈ దేశాల ప్రయాణంలో ఐఫోన్లను పోగొట్టుకుంటే, మళ్లీ దాన్ని కొనుకోవాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని చెబుతోంది.
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తుల ధరలతో డ్యుయిస్ బ్యాంకు ప్రతేడాది ఓ వార్షిక రిపోర్టు తయారుచేస్తోంది. ఈ రిపోర్టులో గ్లోబల్ సిటీలోని 20కి పైగా కామన్ ఉత్పత్తుల ధరలను ఇతర దేశాలతో పోల్చి చూపిస్తోంది. ఈ మేరకు డ్యుయిస్ బ్యాంకు 2016 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్టులో ఐఫోన్ ఏయే దేశాల్లో అత్యంత ఖరీదైనదో వెల్లడించింది.  బ్రెజిల్ స్థానిక కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలర్ల విలువ గతేడాది కంటే దిగొచ్చింది. కానీ ఐఫోన్ ధర మాత్రం బ్రెజిల్లో తగ్గలేదని తెలిపింది. 
 
ఐఫోన్ ధరలు అత్యధికంగా ఉన్న టాప్ దేశాలు
దేశం                  2016 ధర(డాలర్లలో)
బ్రెజిల్                      931
ఇండోనేషియా            865 
స్వీడన్                    796
ఇండియా                 784
ఇటలీ                      766
మరిన్ని వార్తలు